‘తిరంగా ర్యాలీ విజయవంతం చేయండి’

NDL: ఆపరేషన్ సిందూర్‌లో వీరోచితంగా పోరాడి అసువులు బాసిన వీర జవాన్లకు నివాళులర్పిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీని ఈనెల 16న నిర్వహిస్తున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ అన్నారు. గురువారం టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డిని ర్యాలీలో పాల్గొనాలని ఆహ్వానించారు. కూటమి నేతలు హాజరై తిరంగా ర్యాలీ విజయవంతం చేయాలని కోరారు.