బాత్ రూమ్ గుంతలో పడి చిన్నారి మృతి

బాత్ రూమ్ గుంతలో పడి చిన్నారి మృతి

VKB: బాత్ రూమ్ గుంతలో పడి చిన్నారి మృతి చెందిన ఘటన బంట్వారం మండలం సల్బత్తాపూర్‌లో జరిగింది. కోడిచెర్ల రమేశ్- శ్వేతా దంపతుల కుమార్తె హర్ష నందిని (3) గురువారం సాయంత్రం కనిపించలేదు. ఆమె తల్లి ఇంటి ఆవరణలో గాలించగా బాత్ రూమ్ గుంతలో పడి ఉంది. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.