CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ప్రకాశం: కనిగిరి పట్టణంలోని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులను ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు నరసింహ రెడ్డి పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని మొత్తం 46 మందికి రూ. 67,65,252 విలువ గల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ... పేదలకు ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నట్లు తెలిపారు.