సింగపూర్‌లో బిజీబిజీగా మంత్రి సత్యకుమార్

సింగపూర్‌లో బిజీబిజీగా మంత్రి సత్యకుమార్

సత్యసాయి: సింగపూర్ పర్యటనలో భాగంగా ఆరో రోజు మంత్రి సత్యకుమార్ యాదవ్ బృందం ప్రత్యేక 'టేబుల్‌టాప్ ఎక్సర్‌సైజ్' లో పాల్గొంది. పరిపాలనలో ఎదురయ్యే క్లిష్ట సవాళ్లు, అత్యవసర పరిస్థితులను సమర్థంగా ఎదుర్కోవడంపై డాక్టర్ ప్రేమ్ కుమార్ నేతృత్వంలో ఈ శిక్షణ సాగింది. సంక్షోభ సమయాల్లో శాఖల మధ్య సమన్వయం, వేగవంతమైన నిర్ణయాల ప్రాధాన్యతను వారు పరిశీలించారు.