ఆ సేవలు అందించిన వారికి ప్రశంసలు

KRNL: ఆదోని మున్సిపాలిటీలో పనిచేస్తున్న పలువురు సిబ్బంది సేవలను గుర్తించి మున్సిపల్ కమిషనర్ కృష్ణ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా శుక్రవారం ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ మేరకు హెల్త్ అసిస్టెంట్ నాగరాజు, సూపర్వైజర్ మధు, మున్సిపల్ వర్కర్లు మనోహర్, నరసింహులు.. కమిషనర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందుకున్నారు. అనంతరం పలువురు అధికారులు, పట్టణ ప్రజలు వారిని అభినందించారు.