డీసీఎం ఢీకొని వ్యక్తి మృతి
KMR: బాన్సువాడ పట్టణంలోని తాడుకోల్ రోడ్డు చౌరస్తాలో డీసీఎం వాహనం టీవీఎస్ ఎక్సెల్‌ను ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు బిచ్కుంద మండలం గోపాలపల్లి గ్రామానికి చెందిన కురుమ హనుమాన్లుగా గుర్తించారు. ప్రమాదం అనంతరం డీసీఎం డ్రైవర్ వాహనం వదిలి పరారయ్యాడు. మృతుని భార్య బీరవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తుల శ్రీధర్ తెలిపారు.