జనసేన నేత బొబ్బేపల్లిపై తిరుగుబాటు

జనసేన నేత బొబ్బేపల్లిపై తిరుగుబాటు

నెల్లూరు: జనసేన సర్వేపల్లి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బొబ్బేపల్లి సురేష్ నాయుడిపై ఆ పార్టీకి చెందిన 5 మండలాల అధ్యక్షులు తిరుగుబాటుకు దిగారు. వెంకటాచలంలో బుధవారం మీడియాతో మాట్లాడారు. పార్టీ కోసం కష్టపడే జన సైనికులపై ఆయన దూషణలకు దిగడం సరికాదన్నారు. ఆయన తీరు నచ్చకే కొందరు ఇండిపెండెంట్ గా నామినేషన్ వేశారన్నారు. అతనితో కలిసి పనిచేయబోమన్నారు.