గూడూరులో పల్టీ కొట్టిన ఇసుక లారీ

కృష్ణా: గూడూరులో ఓ ఇసుక లారీ పల్టీ కొట్టిన ఘటన శనివారం కలకలం రేపింది. ఇసుకను తరలిస్తున్న లారీ మితిమీరిన వేగంతో వస్తుండగా ప్రమాదానికి గురైందని స్థానికులు తెలిపారు. అధిక లోడు, వేగమే ఈ ఘటనకు కారణమని చెప్పారు. పరిమితికి మించిన లోడుతో అధిక సంఖ్యలో లారీలు తరలి వెళుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవటం లేదని స్థానికులు మండిపడుతున్నారు.