నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన ఆర్డీవో

నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన ఆర్డీవో

మెదక్ ఆర్డీవో రమాదేవి ఇవాళ నిజాంపేట మండల పరిషత్ కార్యాలయంలోని రెండో విడత గ్రామ పంచాయతీ సర్పంచ్ నామినేషన్ ప్రక్రియ కేంద్రాలను పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ.. శాంతియుత వాతావరణంలో ప్రక్రియ కొనసాగేలా చూడాలని అధికారులకు సూచించారు. అభ్యర్థులు కూడా అధికారుల సూచనలు పాటిస్తూ సహకరించాలని కోరారు.