ఇది పిరికిపంద చర్య: KTR
TG: కాంగ్రెస్ నాయకుల గూండాగిరి రోజురోజుకూ శృతి మించుతోందని మాజీమంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి ఇంటిపై కాంగ్రెస్ సర్పంచ్ ట్రాక్టర్‌తో దాడి చేయించడంపై ఆయన స్పందించారు. భౌతిక దాడులకు దిగడం పిరికిపంద చర్య అని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇదే పరిస్థితి కొనసాగితే BRS చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.