'క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి'
VZM: క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన అన్నారు. ఆదివారం రంగారాయపురంలో వాలీబాల్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత సమాజ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలన్నారు. అనంతరం గెలుపొందిన జట్లకు బహుమతులు అందజేశారు.