యర్రవరం జలపాతం రహదారి మూసివేత

యర్రవరం జలపాతం రహదారి మూసివేత

ASR: చింతపల్లి మండలం యర్రవరం జలపాతాన్ని పర్యాటకులు రాకపోకలు సాగించకుండా రెవెన్యూ అధికారులు మూసివేశారు. వర్షాలు తగ్గేవరకు జలపాతానికి రావద్దని తహసీల్దార్ ఆనందరావు సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రమాదకర జలపాతాలలో ప్రాణనష్టం సంభవించకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.