నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

కృష్ణా: పెనమలూరు పరిధిలో శనివారం పలు ప్రాంతాల్లో విద్యుత్ కోత విధించనున్నారు. గంగూరు పవర్ ఆఫీస్ కట్ట, గోసాల వంతెన ప్రాంతాల్లో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సరఫరా నిలిపివేస్తారు. అలాగే బీజేఆర్ నగర్, వసంత్ నగర్, సాయినగర్, సీతాపురం సహా పలు కాలనీల్లో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు విద్యుత్ ఉండదని అధికారులు తెలిపారు.