అమరావతిని సెలెక్ట్ చేయడమే తప్పు: తమ్మినేని

అమరావతిని సెలెక్ట్ చేయడమే తప్పు: తమ్మినేని

AP: అమరావతి సాధ్యం కాదని వైసీపీ నేత తమ్మినేని సీతారాం అన్నారు. జగన్ ప్రతిపాదించిన మావిగన్‌కే సీతారాం మద్దతు తెలిపారు. రాజధానికి ఎన్ని దశాబ్ధాలు పడుతుందని, నిధులు ఎక్కడి నుంచి తెస్తారని ఆయన ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వానికి అమరావతి ఏటిఎంలా మారిందని విమర్శించారు. మావిగన్‌కు తక్కువ ఖర్చు అవుతుందని.. అసలు రాజధానిగా అమరావతిని సెలెక్ట్ చేయడమే తప్పు అని వ్యాఖ్యానించారు.