'ఫీజు చెల్లింపు తేదీల్లో మార్పు లేదు'
PPM: 2026 మార్చ్ నెలలో జరగబోయే పదవ తరగతి పరీక్ష ఫీజు తేదీల్లో ఎలాంటి మార్పు లేదని జిల్లా విద్యాశాఖాధికారి బి.రాజ్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థుల నామినల్ రోలు, సంబంధిత పాఠశాలల u diseలో క్షుణ్ణంగా పరిశీలించి, పరీక్షల ఫీజు చెల్లించి ఓకే చేయాలని సూచించారు. నామినల్ రోల్‌లో ఎటువంటి తప్పులు లేకుండా పరిశీలించాలన్నారు.