నైరాలో పర్యటించిన కలెక్టర్

శ్రీకాకుళం రూరల్ మండలం నైర గ్రామపంచాయతీలో కలెక్టర్ స్వప్నిల్ దిన్‌కర్ పుండ్కర్ నేడు పర్యటించారు. ఆయా గ్రామాల్లో తిరిగి పారిశుద్ధ్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తడి, పొడి చెత్త వేరు చేసి సిబ్బందికి ఇవ్వాలని, పరిసరాలు శుభ్రంగా ఉండడంతో ఆరోగ్యంగా ఉంటామని స్థానికులకు చెప్పారు. పరిశుభ్రతపై శ్రద్ధ వహించాలని సిబ్బందికి సూచించారు. ఆయనతో పలు శాఖాల అధికారు పాల్గొన్నారు.