సర్పంచ్‌లు ఉత్సవ విగ్రహాలుగా మారారు: ఎమ్మెల్సీ

సర్పంచ్‌లు ఉత్సవ విగ్రహాలుగా మారారు: ఎమ్మెల్సీ

PLD: గత ప్రభుత్వంలోని వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థ వల్ల సర్పంచ్‌లు కేవలం ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయారని ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ విమర్శించారు. బుధవారం శాసనమండలిలో ఈ అంశాన్ని ఆయన ప్రస్తావించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన సర్పంచ్‌ల అధికారాలను నిర్వీర్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచ్‌లకు పూర్వ వైభవం తీసుకురావాలని కోరారు.