VIDEO: గంగమ్మకు పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే

VIDEO: గంగమ్మకు పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే

MDK: మాసాయిపేట మండలం కొప్పులపల్లి గ్రామంలోని హల్దీ ప్రాజెక్ట్‌ను మంగళవారం ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి సందర్శించారు. పొంగిపొర్లుతున్న గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. హల్దీ ప్రాజెక్టు పొంగిపొర్లుతుండడంతో సుమారు 2000 ఎకరాల్లో పంటకు నీటి కొరత లేకుండా పోయిందని ఆమె అన్నారు. ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా పడడంతో పంటలు పండే అవకాశం ఉందని అన్నారు.