ఎమ్మెల్యేకు కాంట్రాక్టు ఉద్యోగుల వినతి

RR: క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ను బుధవారం సమగ్ర శిక్ష అభియాన్ ప్రాజెక్టుల్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు తమ సమస్యలపై ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ..తమ సమస్యల పరిష్కరానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.