ముగిసిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

ముగిసిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

VZM: పట్టణంలోని గురజాడ కళాభారతిలో నిర్వహిస్తున్న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు బుధవారంతో వైభవంగా ముగిశాయి. మార్క్ ఫెడ్ రాష్ట్ర ఛైర్మన్ కర్రోతు బంగారు రాజు స్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించి పూజలు నిర్వహించారు. అనంతరం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో శ్రీ కృష్ణుడికి పల్లకి సేవ జరిపించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.