జిల్లాలో నిరుద్యోగులకు శుభవార్త

జిల్లాలో నిరుద్యోగులకు శుభవార్త

PPM: పార్వతీపురం గాయత్రి డిగ్రీ కళాశాలలో డిసెంబర్ 3న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి సాయికృష్ణ చైతన్య తెలిపారు. 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ చేసిన 18- 30 ఏళ్ల నిరుద్యోగ యువతీ యువకులు అర్హులని పేర్కొన్నారు. మొత్తం 23 కంపెనీల ప్రతినిధులు హాజరై ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారని ఆయన వెల్లడించారు.