అక్రమంగా నీటిని తరలిస్తే చర్యలు తప్పవు: ఎమ్మెల్యే
KRNL: దేవనకొండ మండలం పి.కోటకొండ సమీపంలో గాజులదిన్న ప్రాజెక్ట్ నుంచి డోన్‌కు వస్తున్న త్రాగునీటి పైపులైన్‌ను ఆదివారం ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి పరిశీలించారు. కొందరు నీటిని అక్రమంగా పొలాలకు మళ్లిస్తున్నట్లు గుర్తించిన ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆ చర్యలు ఆపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.