CMRF పేద ప్రజలకు కొండంత అండ: ఎమ్మెల్యే
GDWL: నిరుపేదల ఆరోగ్య భద్రతే ధ్యేయంగా ప్రభుత్వం అందిస్తున్న ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) సహాయం బాధిత కుటుంబాలకు కొండంత అండగా నిలుస్తుంది అని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు పేర్కొన్నారు. బుధవారం అలంపూర్ మండలం భీమవరం గ్రామానికి చెందిన సేరి వేదవతికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన రూ.19,500 చెక్కును ఆమె కుటుంబ సభ్యులకు అందజేశారు.