ఘనంగా ‘సీఎం కప్ 2026’ ప్రారంభం
సూర్యాపేట గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘సీఎం కప్ 2026’ క్రీడా పోటీలు జిల్లాలో ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఎస్పీ కె. నరసింహతో కలిసి క్రీడా జ్యోతిని వెలిగించి, ర్యాలీని ప్రారంభించారు. యువత క్రీడల్లో రాణించాలని కోరారు.