VIDEO: కార్తీక సోమవారం.. ఆలయాల్లో భక్తుల పూజలు
GDWL: కార్తీక సోమవారం పర్వదినాన్ని పురస్కరించుకుని, వివిధ ప్రాంతాల నుంచి అలంపూర్‌కు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి జోగుళాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకున్నారు. భక్తులు ముందుగా నదిలో పుణ్య స్నానాలు ఆచరించి, ఆలయం వద్ద దీపారాధన చేశారు. పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన ఈ మాసంలో, భక్తులు గర్భాలయంలో కొలువై ఉన్న స్వామివారికి విశేష పూజలు చేశారు.