నాడు ఒక్క మార్కుతో ఉద్యోగం కోల్పోయి.. నేడు సాధించాడు

నాడు ఒక్క మార్కుతో ఉద్యోగం కోల్పోయి.. నేడు సాధించాడు

VZM: గుర్ల మండలంలోని కొండగండ్రేడు గ్రామానికి చెందిన యువకుడు పొట్నూరు జగన్నాధం అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు. నిన్న విడుదలైన కానిస్టేబుల్ ఫలితాల్లో సత్తాచాటి ఉద్యోగం సాధించాడు. 2019లో జరిగిన పరీక్షలో కేవలం ఒక్క మార్కుతోనే ఉద్యోగం కోల్పోయాడు.. అయినప్పటికీ ఆత్మ విశ్వాసంతో కష్టపడి చదివి అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడు.