పెదగొల్లపాలెంలో ప్రకాశం పంతులు జయంతి

పెదగొల్లపాలెంలో ప్రకాశం పంతులు జయంతి

BPT: ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని కర్లపాలెం మండలం, పెదగొల్లపాలెం జడ్పీ హైస్కూల్‌లో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్‌ఎం పి. సుభాషిణి మాట్లాడుతూ.. ప్రకాశం పంతులు గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు అని, విద్యార్థులు ఆయన్ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. తెలుగు ఉపాధ్యాయుడు నాగరాజు, ప్రకాశం పంతులు జీవిత విశేషాలను వివరించారు.