గ్రామస్తులను అభినందించిన ఎమ్మెల్యే
AKP: కశింకోట మండలం బయ్యవరం గ్రామస్తులు సోలార్ విద్యుత్ ఏర్పాటుకు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అన్నారు. ఆదివారం గ్రామంలో ప్రధానమంత్రి సూర్యఘర్ పథకంపై నిర్వహించిన కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులతో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. వీరందరికీ బ్యాంకులతో మాట్లాడి త్వరితగతిన రుణాలు మంజూరుకు అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.