ఉచిత టీబీ నిర్ధారణ శిబిరాన్ని ప్రారంభించిన ఛైర్‌పర్సన్
KMM: ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు, కరపత్రాలను మున్సిపల్ ఛైర్‌పర్సన్ సామినేని సుజాత పంపిణీ చేపట్టారు. మధిర పట్టణంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఉచిత టీబీ నిర్ధారణ పరీక్షల శిబిరాన్ని నేడు ఛైర్‌పర్సన్‌తో కలిసి వైస్ ఛైర్మన్ ధనికుమార్ ప్రారంభించారు. డిజిటల్ ఎక్స్రే ద్వారా క్షయ అనుమానితులకు పరీక్షలు నిర్వహించారు.