గ్రామీణ మహిళలకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ

NLG: నల్గొండ శివారు రామ్ నగర్‌లోని ఎస్‌బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో గ్రామీణ నిరుద్యోగ మహిళలకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ అందిస్తున్నామని సంస్థ డైరెక్టర్ రఘుపతి తెలిపారు. శిక్షణ కాలంలో ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పిస్తామన్నారు. 19 సంవత్సరాల నుంచి 45 లోపు ఉన్న మహిళలు అర్హులని, మే 1 తేదీ లోపు సంస్థ ఆఫీసులో దరఖాస్తు చేసుకోవాలన్నారు.