VIDEO: ఆరోగ్య ఉప కేంద్రం తనిఖీ చేసిన కేంద్ర బృందం
SRD: కంగ్టి మండల తడ్కల్ ఆరోగ్య ఉప కేంద్రాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ బృందం సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధుల వినియోగానికి సంబంధించి రికార్డులను కమిటీ సభ్యులు పరిశీలించారు. డాక్టర్ సంతోష్ నాయక్, రంజన్ దాస్‌లు మందుల పంపిణీ వివరాలను ఉప కేంద్రం అధికారులకు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జగన్నాథ్ రెడ్డి, డిప్యూటీ DMHO తదితరులు పాల్గొన్నారు.