సూక్ష్మ సైజులో అమరవీరుల స్థూపం
BHNG: భువనగిరి పట్టణానికి చెందిన స్వర్ణకారుడు చొల్లేటి శ్రీనివాసాచారి ఈ నెల 21న పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సూక్ష్మ సైజులో పోలీసు అమరవీరుల స్థూపాన్ని తయారు చేశారు. 40 గ్రాముల వెండితో 4 ఇంచుల ఎత్తులో రూపొందించి హౌరా అనిపించారు. ఆయన గతంలోనూ బంగారం వెండితో క్రికెట్ స్టేడియం, క్రికెట్ వరల్డ్ కప్, బంగారు బతుకమ్మ, క్రికెట్ బాల్ వంటివి తయారు చేశారు.