పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్ డ్రైవ్
KDP: దూడల గొంతువాపు వంటి వ్యాధులు నివారించడానికి కమలాపురం మండలంలో ఇందిరమ్మ కాలనీలో పశుసంవర్ధక శాఖ నిర్వాహకత్వంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. అసిస్టెంట్ డైరెక్టర్ ఉత్తయ్య మాట్లాడుతూ.. 'పశువుల ఆరోగ్యం కోసం ఈ టీకాలు అత్యంత కీలకంగా ఉంటాయి. ప్రతి పశుపాలకుడు తన పశువులకు టీకాలు సమయానికి వేయించుకోవాలి' అని అన్నారు. కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.