రేపు జిల్లా వ్యాప్తంగా గ్రామసభలు

రేపు జిల్లా వ్యాప్తంగా గ్రామసభలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 471 గ్రామపంచాయతీల్లో రేపు గ్రామసభలు నిర్వహించనున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి సుధీర్ కుమార్ తెలిపారు. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ సభలు జరుగుతాయన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుతో పాటు స్థానిక సమస్యలపై ఈ సభల్లో సమగ్రంగా చర్చించనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశామని ఆయన పేర్కొన్నారు