వేణుగోపాల్ రెడ్డి కి నివాళి అర్పించిన ఎమ్మెల్యే కొరముట్ల.

కడప: చిట్వేలి మండలం ఎం గొల్లపల్లి గ్రామం నందు మరణించిన ఓబిలి వేణుగోపాల్ రెడ్డి భౌతిక కాయానికి ప్రభుత్వ విప్, శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు శనివారం పూలమాల వేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. చెవ్వు శ్రీనివాసులు, రెడ్డి మోహన్ రెడ్డి, సుధాకర్ రాజు, రమణారెడ్డి, భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.