లారీ ఢీకొని వ్యక్తి మృతి

లారీ ఢీకొని వ్యక్తి మృతి

KNR: లారీ ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన నగనూరులో చోటుచేసుకుంది. CI నిరంజన్ రెడ్డి వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తాటికొండ కొమురయ్య, నరసవ్వ దంపతులు కరీంనగర్‌లో పని ముగించుకుని టీవీఎస్ ఎక్సెల్‌పై గ్రామానికి తిరిగి వస్తుండగా, ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కొమురయ్యను ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు.