జాతీయ రహదారిపై లారీ బోల్తా..
MBNR: జాతీయ రహదారిపై భూత్పూర్ మండలం శేరిపల్లి స్టేజ్ వద్ద శనివారం మధ్యాహ్నం భారీ ప్రమాదం తప్పింది. టైల్స్ లోడుతో బాలనగర్ నుంచి కర్ణాటక వెళ్తున్న లారీ, ముందున్న టిప్పర్ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో లింగంపేటకు చెందిన డ్రైవర్ అహ్మద్‌కు గాయాలయ్యాయి. టిప్పర్ బ్రేక్ వేయడమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.