చెత్త సేకరణ వాహనాలు ప్రారంభించిన ఎమ్మెల్యే

చెత్త సేకరణ వాహనాలు ప్రారంభించిన ఎమ్మెల్యే

W.G: ఆచంట మండలం కరుగోరుమిల్లి, పెనుమంచిలి గ్రామాలలో చెత్త సేకరణ కోసం కేటాయించిన నూతన వాహనాలను ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణ ప్రాంతాలకు దీటుగా గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. గ్రామీణ అభివృద్ధికి ప్రభుత్వ సహకారంతో పాటు ప్రజల సహకారం కూడా తప్పనిసరి అని పేర్కొన్నారు.