చిలకలపూడిలో అపహరణకు గురైన బైక్‌ అప్పగింత

చిలకలపూడిలో అపహరణకు గురైన బైక్‌ అప్పగింత

కృష్ణా: చిలకలపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆంజనేయులు అనే వ్యక్తికి చెందిన యమహా బైక్ దొంగలు అపహరించినట్లు ఫిర్యాదు అందడంతో పోలీసులు వెంటనే స్పందించారు. చిలకలపూడి సీఐ నబీ ఆధ్వర్యంలో పోలీస్ బృందం దర్యాప్తు చేపట్టి కేవలం 12 గంటల వ్యవధిలో ఆ బైక్‌ను గుర్తించి బాధితునికి తిరిగి అందజేశారు. ఎస్ఐ సుబ్రమణ్యం, హెడ్ కానిస్టేబుల్ కీలక పాత్ర పోషించారని వారిని అభినందించారు.