టీడీపీ నేత బైక్‌ను కాల్చేసిన దుండగులు
అన్నమయ్య: తంబళ్లపల్లెలో మంగళవారం రాత్రి TDP నేతకు చెందిన బైకును కాల్చివేసిన ఘటన కలకలం రేపింది. బోడికిందపల్లెకు చెందిన TDP నేత రామలింగా రెడ్డి మంగళవారం బైకుపై ఇంటి నుంచి తంబళ్లపల్లెకు వస్తుండగా.. మార్గమధ్యంలో మొరాయించడంతో రోడ్డుపై వదిలేసి వచ్చారు. అనంతరం సొంత పనులపై బెంగళూరు వెళ్లారు. రోడ్డుపై వదిలిన బైక్ను మంగళవారం రాత్రి ఎవరో కాల్చివేశారు.