పాముకాటుకు గురైన యువకుడు మృతి

KRNL: దేవనకొండ మండలంలోని కరివేముల గ్రామానికి చెందిన రవికుమార్ (21) పాముకాటుకు గురై చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు సోమవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా పాము కరిచి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నాటు వైద్యం చేసిన తర్వాత కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్సతో కోలుకోలేక మృతి చెందాడు.