కోదాడలో 200 జాతీయ జెండాలతో ర్యాలీ

SRPT: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం కోదాడలో 200 జాతీయ జెండాలతో సత్యమేవ జయతే సేవాసమితి ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఆ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు నాదెళ్ళ బాలకృష్ణ గురువారం తెలిపారు. అమరవీరులకు నివాళులర్పించేందుకు ఖమ్మం రోడ్ నుంచి రామిరెడ్డి పాలెం రోడ్డులోని 100 అడుగుల జాతీయ జెండా వరకు 20 ట్రాక్టర్లు,100 బైకులతో ఈ ర్యాలీ జరుగుతుందన్నారు.