సీసీ కెమెరాలను ప్రారంభించిన ఎస్సై
MHBD: కొత్తగూడ మండలం గోవిందాపురం గ్రామంలో సర్పంచ్ ఈర్ప అనిత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను శనివారం ఎస్సై రాజకుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని, ఎటువంటి నేరం జరిగిన క్షణాల్లో నిందితులను సీసీ కెమెరాలతో పట్టుకోవచ్చని తెలిపారు. ప్రతి గ్రామంలో ప్రజలు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.