VIDEO: జిన్నా టవర్ సమీపంలో పేరుకుపోయిన వ్యర్థాలు
గుంటూరు జిన్నా టవర్ సమీపంలోని కాలువలు చెత్తాచెదారంతో నిండిపోయి దుర్గంధం వెదజల్లుతున్నాయి. పది రోజుల క్రితం అరకొరగా పనులు చేసి వదిలేయడంతో అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదని, తక్షణమే కాలువలను శుభ్రం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.