దసరా పూజలకు రావాలని రఘురామిరెడ్డికి ఆహ్వానం

దసరా పూజలకు రావాలని రఘురామిరెడ్డికి ఆహ్వానం

KDP: మైదుకూరులో ఈనెల 22 నుంచి దసరా ఉత్సవాలు నిర్వహించనున్నారు. వీటికి హాజరు కావాలని మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డిని పలువురు ఆహ్వానించారు. ప్రొద్దుటూరులోని ఆయన నివాసంలో ఆదివారం కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. మైదుకూరు ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు చెన్నకేశవ ప్రసాద్, వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ ఎలిశెట్టి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.