VIDEO: కొనుగోళ్లు నిలిపివేత.. అడ్తి వ్యాపారుల ధర్నా
WGL: ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో పంట ఉత్పత్తుల కొనుగోళ్లు సోమవారం నిలిచిపోయాయి. ఇద్దరు అడ్తి వ్యాపారులను భూపాలపల్లి పోలీసులు కొట్టారని ఆరోపిస్తూ వ్యాపారులు ఆందోళనకు దిగారు. మార్కెట్ కార్యదర్శి కార్యాలయం ముందుధర్నా నిర్వహించారు. పోలీసులపై ఉన్నత అధికారులు చర్యలు తీసుకునే వరకు కొనుగోళ్లు చేపట్టబోమని స్పష్టం చేశారు. దీంతో మార్కెట్‌లో కార్యకలాపాలు స్థంభించాయి.