MGM ఆసుపత్రిలో ఉద్రిక్తత

MGM ఆసుపత్రిలో ఉద్రిక్తత

WGL: MGM ఆస్పత్రిలో ఎలుకలు మరోసారి సంచలనం రేపాయి. ఆర్థోపెడిక్ డిపార్ట్‌మెంట్‌లో కాలు తొలగింపు సర్జరీ చేసుకున్న రోగికి ఎలుక కరవడంతో ఆసుపత్రి వాతావరణం ఉద్రిక్తమైంది. రోగి బంధువులు సిబ్బందికి సమాచారం ఇవ్వగా.. అప్రమత్తమైన సిబ్బంది టీటీ ఇంజెక్షన్ వేశారు. అయినా ఇన్‌పెక్షన్ ప్రమాదం ఉందని భావించి రోగిని ఇంటికి పంపే ప్రయత్నం చేస్తున్నారని బంధువులు ఆరోపించారు.