భద్రతా సమస్యలతో.. షెడ్యూల్ మార్పు
2009 పాక్ పర్యటనలో శ్రీలంక క్రికెటర్లపై ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. తాజాగా ఇస్లామాబాద్‌లో బాంబు పేలుళ్లు జరగడంతో పాక్ పర్యటనలో ఉన్న శ్రీలంక క్రికెటర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దీంతో ఇస్లామాబాద్‌లో జరగాల్సిన మ్యాచ్‌లను రావల్పిండికి మార్చారు. అలాగే, పాక్, శ్రీలంక, జింబాబ్వే మధ్య జరగాల్సిన ముక్కోణపు సిరీస్ షెడ్యూలును కూడా సవరించారు.