అగ్ని ప్రమాదంలో కాలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే

అగ్ని ప్రమాదంలో కాలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే

ADB: నేరడిగొండ మండలంలోని లక్కంపూర్ గ్రామానికి చెందిన జానకిరామ్ ఇంట్లో షాక్ సర్క్యూట్ తో మంటలు చెలరేగి ఇల్లు పూర్తిగా కాలిపోయింది. ఈ విషయం తెలుసుకున్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ శనివారం అగ్ని ప్రమాదం జరిగిన ఇంటిని పరిశీలించి జానకిరామ్‌ను పరామర్శించారు. అనంతరం అధికారులతో మాట్లాడి తక్షణ సహాయం అందేలా చూస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.