CPM అభ్యర్థిగా శాంతమ్మ
JN: పాలకుర్తి మండలంలోని గూడూరు గ్రామంలో ఇవాళ CPM పార్టీ నేతలు రానున్న గ్రామపంచాయతీ ఎన్నికలపై మండల కార్యదర్శి సారయ్య అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గూడూరు గ్రామ CPM అభ్యర్థిగా మాచర్ల శాంతమ్మను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యకర్తలు సైనికుల వలె పని చేసి శాంతమ్మ గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.